Police Officers: నలుగురు పోలీసులకు 4వారాల జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో పోలీసులకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నలుగురు పోలీసులు 4వారాల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పోలీసు అధికారులైన శ్రీనివాస్‌, సుదర్శన్‌కు, రాజశేఖర్‌రెడ్డి, నరేశ్‌కు జైలు శిక్ష ఖరారు అయింది.

Kissing And Fondling Boy Not Unnatural Offence Says Bombay High Court

Police Officers: కోర్టు ధిక్కరణ కేసులో పోలీసులకు షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నలుగురు పోలీసులు 4వారాల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా జాయింట్‌ సీపీ శ్రీనివాస్‌, బంజారాహిల్స్‌ ఏసీపీ సుదర్శన్‌కు, జూబ్లీహిల్స్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేశ్‌కు జైలు శిక్ష ఖరారు అయింది.

నలుగురికిపై డిపార్ట్‌మెంటల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని సీపీకి ఆదేశం ఇచ్చింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపారు.

సుప్రీం నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగం నమోదుకావడంతో.. అప్పీలుకు వెళ్లేందుకుగానూ శిక్ష అమలును 6వారాల పాటు నిలిపేసింది హైకోర్టు.

Read Also : ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ కేసు..విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం కోర్టు