Drugs Rahul
Police Raid On Radisson Blu Plaza Hotel : హైదరాబాద్ బంజారాహిల్స్ లో డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో 142 మందితో కూడిన లిస్టును విడుదల చేశారు పోలీసులు. లిస్టులో 11వ నెంబర్ గా గల్లా జయదేవ్ రెండో కుమారుడు గల్లా సిద్ధార్థ, 122 నెంబర్ గా రాహుల్ సిప్లీగంజ్ పేర్లున్నాయి. జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వీరి అడ్రస్ లు, ఫోన్ నెంబర్ లు తీసుకుని నోటీసులు ఇచ్చారు. వీరిని కౌన్సెలింగ్ ఇచ్చారు. క్లూస్ టీం ఇప్పటికే అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో నార్కోటింగ్ వింగ్ రంగంలోకి దిగింది.
Read More : Drug case : 142 మంది పేర్లు వెల్లడి, నోటీసులు ఇచ్చిన పోలీసులు
పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఫ్లోర్ మేనేజర్ ఉన్నట్లు సమాచారం. రాడిసన్ హోటల్ నుంచి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 45 మంది ఎవరు అనేది తెలియరాలేదు. వీరు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీకి మొత్తం 99 మంది యువకులు, 33 మంది యువతులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. హోటల్ రూమ్స్ నుంచి డ్రగ్ ఆర్గనైజర్లు పార్టీకి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హోటల్ రూమ్స్ లో ఇంకా డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో ముమ్మరంగా సోదాలు జరుపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.
Read More : Banjarahills : పబ్ లేట్‌నైట్ పార్టీ కేసులో వెలుగులోకి వీఐపీలు
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో తవ్వుతున్న కొద్దీ ప్రముఖుల మత్తు జాతకాలు బయటపడుతున్నాయి. షుగర్ క్యాండీల మాటున దాగిన ఎల్‌ఎస్‌డీ ప్యాకెట్లు దొరికినట్టే.. సెలబ్రిటీల పిల్లల కథలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. తెల్లవారుజామున జరిగిన రైడింగ్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో సినీ, రాజకీయ, అధికార ప్రముఖుల పిల్లలంతా ఉన్నారని సమాచారం. ఇటు పబ్ కూడా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ కుమార్తెది.. కాగా, స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.