Police Raids On Pubs: పబ్బుల్లో పోలీసుల తనిఖీలు.. తొలిసారి రంగంలోకి స్నిపర్ డాగ్స్

పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై నజర్ పెట్టిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులు తొలిసారిగా స్నిపర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు.

Police Raids On Pubs

Hyderabad Pubs : హైదరాబాద్ లోని పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పలు పబ్బుల్లో ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పబ్బుల్లో డ్రగ్స్, గంజాయి అమ్మకాలపై నజర్ పెట్టిన పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో పోలీసులు తొలిసారిగా స్నిపర్ డాగ్స్ ను రంగంలోకి దింపారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్బుల్లో ఆకస్మిక సోదాలు చేసినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో సుమారు 17కుపైగా పబ్ లలో ఆకస్మీక సోదాలు చేశామని అన్నారు. అయితే, పబ్ లో సోదాల సమయంలో ఎలాంటి డ్రగ్స్, అనుమానాస్పద వస్తువులు లభించలేదని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు.

Also Read : Akash missile system: ఇలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి దేశంగా భారత్.. మన క్షిపణి లక్ష్యాన్ని ఎలా ఛేదించిందో చూడండి..

మా ఉన్నతాధికారుల సూచనల మేరకు తనిఖీలు చేస్తున్నామని, భవిష్యత్ లో కూడా తనిఖీలు చేస్తామని ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. అన్ని పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. స్లీపర్ స్నిపర్ డాగ్ లను తీసుకువెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పబ్ లో డ్రగ్స్ , గంజాయి అమ్మకాలపై దృష్టి సారించామని, మొదటిసారి స్నిపర్ డాగులను క్లూస్ టీమ్ వెంటబెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్ అమ్మకాలు జరిపిన వారిపై కఠినచర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు.