Kamareddy : కామారెడ్డిలో కళ్యాణ మండపాన్ని తలపిస్తున్న పోలింగ్ కేంద్రాలు

తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి తలపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇక ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తున్నాయి.

Kamareddy

Kamareddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఇప్పుడు కామారెడ్డివైపే ఉంది. ఈ నియోజకవర్గం నుండి సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి బరిలో ఉండటం ప్రధాన కారణం. ఇక ఇక్కడి పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Telangana Assembly Election 2023 : కామారెడ్డిలో హై టెన్షన్ .. పోలింగ్ కేంద్రం వద్ద రేవంత్ సోదరుడితో బీఆర్ఎస్ నేతల ఘర్షణ

కామారెడ్డి నియోజకవర్గంలో కొద్దిరోజులుగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకు ప్రధాన కారణం సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి బరిలో ఉండగా బీజేపీ నుండి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తంగా ప్రధాన పార్టీల అభ్యర్ధులు, ఇండిపెండెంట్లతో కలిపి 30 మంది బరిలో ఉన్నారు. 2,52,000 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 1,32,000 మంది మహిళా అభ్యర్ధులు ఉండటం విశేషం. ఇక్కడ అభ్యర్థి గెలుపును ప్రధానంగా మహిళా ఓటర్లు నిర్ణయించబోతున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కామారెడ్డి నియోజకవర్గం పోలింగ్ ప్రశాంతంగా జరగటానికి ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 266 పోలింగ్ కేంద్రాలున్న ఈ నియోజకవర్గంలో 35 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 4000 మంది పోలీసులను మోహరించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు కామారెడ్డిలో 40 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెళ్లి మండపాలను తలపిస్తున్న ఈ పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలక్షన్ అధికారులు కూడా మహిళలే ఉంటారు. ఈ కేంద్రాలను చూస్తుంటే ఓటు వేయడానికి వెళ్తున్నామా? పెళ్లికి వెళ్తున్నామా? అన్న సందేహం కలగకమానదు.

BiggBoss 7 : బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ఎలా వేస్తారు..?

మొత్తానికి 39 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన కామారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ కామారెడ్డితో పాటు గజ్వేల్ నుండి పోటీ చేస్తుండగా, రేవంత్ రెడ్డి కామారెడ్డి, కొడంగల్ నుండి పోటీ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు