Ponguleti Srinivas Reddy (5)
Ponguleti Srinivas Reddy Cast to Vote : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రజలందరూ ఓటు హక్కు వినయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం పోలింగ్ కేంద్రంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అనంతరం పొంగులేటి మాట్లాడుతూ ఓటు వేయడం అందరం బాధ్యత అని అన్నారు. ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని కోరారు. ఎవరూ ఓటు హక్కును కోల్పోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో మేలు చేసే ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.
KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్
ఎంత త్వరగా పోలింగ్ కేంద్రాలకు రాగలరో అంత త్వరగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారుు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగునుంది. 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
పోలీసుల నిఘా నీడల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వరిస్తున్నారు.