Ponguleti Srinivas Reddy : ఇక దోపిడీలు, కబ్జాలు బంద్, నిరంకుశ పాలకుల ఘడీలకు తాళాలు వేస్తాం : పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ponguleti srinivas reddy

Ponguleti Srinivas Reddy : ఎట్టకేలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక క్లియర్ అయ్యింది. ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించే భారీ సభలో పొంగులేటి, జూపల్లి తో పాటు  భారీ సంఖ్యలో హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు.  ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో తెలంగాణలో ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.అధికార మదంతో సామాన్యుల ఇంటి స్థలాలు కబ్జా చేశారు అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Telangana Congress: ఇక సమరమే.. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తూ ముందుకు..

చెమటచుక్కలు చిందించి సంపాదించుకున్న మెతుకులు కూడా తిననివ్వలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.వ్యాపారం,కాంట్రాక్టులు కూడా వాళ్లే చేస్తారట ఎవ్వరిని ఏమీ చేసుకోనివ్వటంలేదంటూ మండిపడ్డారు. మరో రెండు నెలల్లో దోపిడీదారులను కూకటి వేళ్ళతో పెకిలిస్తాం అంటూ వ్యాఖ్యానించారు.ప్రజల దీవెనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తంచేశారు.తెలంగాణ రాష్ట్రానికి సోకిన నిరంకుశ పాలనను పాలిస్తున్న ఘడీలకు తాళాలు వేసి ఇంటికి పంపుడు కార్యక్రమం తప్పదన్నారు.

ఈ రెండు నెలలు ఇబ్బందులు ఉంటాయి భరించాలి..భరిస్తే మంచి రోజులొస్తాయి అని ఆశాభావం వ్యక్తంచేశారు.రాబోయేది మన ప్రభుత్వమే ఎవ్వరు ఎటువంటి భయాలకు గురికావవద్దు అంటూ భరోసా ఇచ్చారు. కూతురి పెళ్లి కోసం Nsp కాలువపై కట్టిన వంతెనను రాత్రి రాత్రే కూల్చాలని ప్రయత్నం చేశారు అంటూ ఆరోపించారు.రెండు నెలల్లో ఖేల్ ఖతం దుఖాన్ బంద్.. వారి శేష జీవితాన్ని కూడా మిగల్చొద్దు అంటూ హాట్ కామెంట్స్ చేశారు పోంగులేటి శ్రీనివాస రెడ్డి.


Komatireddy Venkat Reddy : త్వరలో 70 సీట్ల ప్రకటన, ఆ తర్వాత రాజకీయాలకు దూరం- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు