Tellam Venkata Rao
Tellam Venkata Rao Join BRS : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. అయితే తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటున్నారు.
2018లో తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భద్రాచలం టికెట్ ఆశించి వెంకట్రావు కాంగ్రెస్ లో చేరారు. కానీ, కాంగ్రెస్ టికెట్ పొదెం వీరయ్యకే ఇచ్చే అవకాశం ఉండడంతో తెల్ల వెంకటరావు మనసు మార్చుకున్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
Telangana Congress: బీఆర్‌ఎస్, బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్.. పెరిగిన నేతల తాకిడి
ఇప్పటికే తెల్లం వెంకట్రావుతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బీఆర్ఎస్ లోకి వస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తెల్లం వెంకట్రావుతో ఇటీవలే పొంగులేటి వెంట రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.