జయశంకర్ భూపాల పల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ ఇంజనీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే ఇంజనీర్లు అన్ని వివరాలు తెలిపారు.
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంశాలు…
నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కామెంట్స్..
మేడిగడ్డ బ్యారేజ్ 1.25 మీటర్ల మేర కుంగింది
క్రాక్ వెడల్పు 150 ఎంఎం టు 250 మధ్యలో ఉంది
నిన్నటి నుంచి ప్రైవేట్ ఏజెన్సీ సర్వ్ ప్రారంభమైంది
10 నుంచి 12 రోజులు సమయం పడుతుంది
3 కొత్త గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది
గేట్లను బ్లాస్టింగ్ చేయడం సాధ్యం కాదు.. కటింగ్ చేయాల్సి ఉంటుంది
మరిన్ని అంశాలు
మేడిగడ్డ నుంచి 7 లింక్స్ ద్వారా నీరు ఎత్తిపోతలు
పాత ఆయకట్టుతో పాటు కొత్తగా 19.63 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి ప్రణాళికలు
240 టీఎంసీలకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతి వచ్చింది
సాగునీరు, తాగు నీరు, పరిశ్రమల కోసం లిఫ్ట్ నీరు
గోదావరిపై మూడు బ్యారేజ్‌లు కట్టాం
6 చీఫ్ ఇంజనీర్లు పని చేశారు
8,450 మెగా వాట్స్ పవర్ అవసరం 3 టీఎంసీ లిఫ్టింగ్ కోసం
మొత్తం 93,872 కోట్ల ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడు టీఎంసీలకు
97 వేల ఎకరాల భూసేకరణ చేశాం
నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు వచ్చి పరిశీలించారు
కుంగిన పియర్స్ మూడు.. అందులో ఒకటి 1.25 మీటర్లు కుంగింది
గేట్లు కూడా డ్యామేజ్ జరిగి వాడే పరిస్థితి లేదు
ప్రైవేట్ సంస్థలు పరిశీలిస్తున్నారు, రెండు వారాల్లో రిపోర్ట్ ఇస్తాం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే?
రూ.లక్ష కోట్ల తెలంగాణ ప్రజల సంపద నిరూపయోగం
మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ రూ.లక్ష 27 వేల కోట్లు, ఇది తెలంగాణపై అధిక భారం
మొత్తం ఇరిగేషన్ శాఖలో పెండింగ్ బిల్స్: సుమారు రూ.8 వేల కోట్లు
గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో పెండింగ్ బిల్స్ రూ.9 వేల కోట్లు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే?
కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు గత ప్రభుత్వం తప్పు
మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై బాంబు కుట్ర అనేది తప్పు
బాంబు కుట్ర అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది
ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టని చెప్పుకున్నారు
వాస్తవం చూస్తే ఎమీ ఉపయోగం లేదు
ఇరిగేషన్ అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి ఏమన్నారంటే?
ఆలోచన లేని పని చేశారు
కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి
కాళేశ్వరం ప్రాజెక్టు తుగ్లక్ ప్రాజెక్టు
గ్రావీటితో పూర్తి అయ్యే ప్రాజెక్టు బదులు నదిలో 3 ప్రాజెక్టుల కట్టడం తుగ్లక్ చర్య
కేసీఆర్ బంధువు కోసమే టెండర్ లేకుండా పనులు ఇచ్చారు
ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు సాధ్యం కాదని చెప్పాలి… లేదంటే లీవ్ పెట్టి వెళ్లాలి