మాజీ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదుగురు నిందితులను సిట్ ఇప్పటికే విచారించింది.
నిందితుల స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలతో ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తోంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్, ఫోరెన్సిక్ నుంచి సిట్ డేటాను తెప్పించుకుంది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకి సిట్ లంచ్ బ్రేక్ ఇచ్చింది.
సిట్ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పలేక పోతున్నారు. కోర్టులో వినిపించిన వాదనలనే మరోసారి సిట్ ముందు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై రివ్యూ కమిటీ ఉంటుందని, ఆ కమిటీలో తాను సభ్యుడినే కాదని ప్రభాకర్ రావు చెప్పారు.
Also Read: స్పృహతప్పి పడిపోయిన భూమా అఖిలప్రియ.. ఆసుపత్రికి తరలింపు
తనకు, ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధం లేదని తెలిపారు. ఫోన్లు ట్యాప్ చేయాలని అధికారులకు తాను ఎన్నడూ ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. తాను ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని చెప్పారు.
తాను 2023 డిసెంబర్ 4 సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశానని, అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్ డిస్క్ లు ధ్వంసం అయితే దానితో తనకు సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. రివ్యూ కమిటీ సభ్యులను కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదని అడిగారు.