Telangana PRC : గుడ్ న్యూస్.. తెలంగాణలో పీఆర్సీ జీవోలు విడుదల..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ అమలు జీవోలను విడుదల చేసింది. పీఆర్సీ వేతన సవరణలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

Telangana PRC  GOs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం పీఆర్సీ అమలు జీవోలను విడుదల చేసింది. పీఆర్సీ వేతన సవరణలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 30 శాతం పీఆర్సీ వర్తింపచేయనుంది.

జూన్ నెల నుంచి పెంచిన పీఆర్సీ అమలు కానుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ వర్తింపు అందజేయనుంది. పెన్షనర్ల మెడికల్ అలవెన్సు రూ. 350 నుంచి రూ.600కి పెంచింది రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ. 12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొంత నిరాశే ఎదురైంది. వేతన సవరణ కమిషన్ సూచించనట్టుగా కనీస వేతనాలు రూ.19వేలను అమలు చేస్తారని భావించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30శాతం మాత్రమే పెంచారు. జూన్‌ నెల నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఏప్రిల్‌, మే నెల బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొత్త పీఆర్సీ అమలుకు సంబంధించి త్వరగా జీవోలు జారీ చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావును పీఆర్‌టీయూ తెలంగాణ కోరింది. ఇదివరకే జూన్‌ నెల జీతంతోనే పీఆర్సీ అమలు ఉంటుందని హరీశ్‌రావు వెల్లడించారు. ఇదే నెలలో ఉద్యోగులు కొత్త వేతనాలను అందుకుంటారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు