రాత్రికి రాత్రే తొమ్మిది నెలల గర్భం మాయం

  • Publish Date - May 4, 2020 / 04:55 AM IST

ఇదొక వింత ఘటనే.. అసలు నిజమేనా? అబద్దమా? ఏది నిజం ఏది అబద్ధం.. అంతా అయోమయం.. జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపుతున్న కథ ఇది. ప్రసవం కోసం వెళుతుంటే, దేవుడు కనిపించి, ఇంటికి తిరిగి వెళ్లమని చెప్పాడంటూ.. ఆపై ఇంటికి రాగానే కడుపులోని శిశువు మాయం అయిందంటూ ఓ మహిళ చెప్పడం ఇప్పుడు గద్వాల ప్రాంతంలో చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. గద్వాల జిల్లా మానవపాడు గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ నిండు గర్భిణి. ప్రసవం కోసం కుటుంబీకులతో కలిసి ఆసుపత్రికి బయలుదేరిన ఆమె.. దేవుడు కనిపించి, ఇంటికే వెళ్లాలని చెప్పాడంటూ.. ఇంటికి వెళ్లింది.

అనంతరం ఆమె కడుపులోని శిశువు తెల్లారేసరికి కనిపించలేదంటూ ఆమె చెబుతుంది. దీంతో వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. ఆమెకు నెల రోజుల క్రితమే అబార్షన్ అయిందంటూ స్పష్టం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్ పర్సన్ మంజుల, ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని, అవసరమైతే మరోసారి స్కానింగ్ తీయించాలని ఆదేశించారు. అయితే మంజులకు చికిత్స చేసిన డాక్టర్ దివ్య మాట్లాడుతూ.. ఆమె అవాస్తవం చెబుతున్నారని, సైకలాజికల్ ట్రీట్ మెంట్ చేయించాలంటూ సూచనలు చేశారు.

Also Read | వైరస్ లక్షణాలు లేకున్నా గర్భిణులకు కరోనా పరీక్షలు, ప్రభుత్వం కీలక నిర్ణయం