President Draupadi Murmu: సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

గత ఏప్రిల్‌ నెలలో సుఖాయ్ జెట్‍‌లో ప్రయనించాను. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో విహరించి పలు ప్రదేశాలను వీక్షించాను. ఆ సమయం నేను చాలా గొప్ప అనుభూతి పొందాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

President Droupadi Murmu

Draupadi Murmu: సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ‌లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా ద్రౌపది ముర్ము హాజరయ్యారు. గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్‌ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యడెట్లు దేశంకోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని అన్నారు. టర్కీ‌లో జరిగిన భూకంపం‌లోకూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని రాష్ట్రపతి కొనియాడారు. కోవిడ్‌లోనూ చాలా అద్భుతంగా పనిచేసిందని అన్నారు.

Draupadi Murmu : రాష్ట్రపతి హెలికాప్టర్‌తో సెల్ఫీ తీసుకున్నందుకు మెడికల్ ఆఫీసర్ సస్పెండ్

సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ద్రౌపది ముర్ము సూచించారు. గత ఏప్రిల్‌ నెలలో సుఖాయ్ జెట్‍‌లో ప్రయనించానని, దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్ లో విహరించి బ్రహ్మపుత్రి, తేజ్ పూర్ లోయలు, హిమాలయాలు అద్భుతాలను వీక్షించానని చెప్పారు. ఆ సమయం నాకు చాలా గొప్ప అనుభూతి అన్నారు. ఫైటర్ జెట్ ఫైలెట్లలో మహిళలుసైతం అధికంగా ఉండటం సంతోషదాయకం అన్నారు. కాగా పరేడ్‌కు రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

President Droupadi Murmu : హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన .. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

ఇదిలాఉంటే మొత్తం 119 ఫ్లైయింగ్ ఎయిర్ ట్రైనీ, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరితో పాటు ఎనిమిది మంది ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అందులో ఇద్దరు వియత్నాం క్యాడెట్లు, ఆరుగురు నేవీ, కోస్ట్ గార్డ్‌కు చెందిన క్యాడెట్లు ఉన్నారు. ఇదిలాఉంటే రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.