Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట చేరుకున్నారు.
- bheemraj
- Updated on- July 2, 2022 / 08:13 PM IST
Modi Tweet
PM Modi Tweet : ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. డైనమిక్ సిటీ అంటూ హైదరాబాద్ ను ప్రస్తావించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట చేరుకున్నారు.
గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో ప్రధాని హైటెక్స్ ప్రాంగణానికి చేరుకున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలో మోదీ పాల్గొననున్నారు.
PM Modi : హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని
సాయంత్ర 4 గంటలకు ప్రారంభమైన సమావేశాలు రాత్రి 9 గంటలకు వరకు కొనసాగనున్నాయి. రాత్రికి నోవాటెల్ లో ప్రధాని మోదీ బస చేయనున్నారు.
