PM Modi Warangal Tour: 29ఏళ్ల తరువాత..! ఓరుగల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ .. టూర్ షెడ్యూల్ ఇలా..

మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే శంకుస్థాపన చేస్తారు.

PM Modi

PM Narendra Modi: చారిత్రక ఓరుగల్లులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శనివారం పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ పర్యటనలో భాగంగా కాజీపేట (Kazipet) అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ (Wagon industry) పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే జరిగే ‘విజయ సంకల్ప సభ’లోమోదీ పాల్గొంటారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రులు నితిన్ గఢ్కరీ, కిషన్ రెడ్డిలు పాల్గొంటారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీ చుట్టూ 20 కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. పీఎం సెక్యూరిటీ చూసే ఎస్పీజీ దళాలకు తోడు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ డీజీపీల పర్యవేక్షణలో సుమారు పదివేల మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గోనున్నారు.

PM Modi : ప్రధాని వరంగల్ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 15నిమిషాల పాటు ప్రధాని అక్కడే ఉంటారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో రెండు వేదికలను ఏర్పాటు చేశారు. మొదటి వేదికలో ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా, రెండో వేదికపై బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజలు మోదీ ప్రసంగాన్ని తిలకించేందుకు ప్రత్యేకంగా 30 ఎల్ ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. తొలిసారి ప్రధాని మోదీ వరంగల్ వస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఓరుగల్లు కాషాయ మయంగా మారింది. ఇదిలాఉంటే.. వరంగల్ కు 1994లో ప్రధాని హోదాలో పీవీ వచ్చారు. మళ్లీ ఉమ్మడి వరంగల్ కు ప్రధానులెవరూ రాలేదు. 29ఏళ్ల తరువాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటకు రానున్నారు. మరోవైపు విజయ సంకల్ప సభ వేదికపై ప్రధానితో పాటు మరో ఎనిమిది మంది మాత్రమే కూర్చుంటారు. సభలో ప్రధాని 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు.

Tamim Iqbal : గురువారం రిటైర్మెంట్.. శుక్ర‌వారం ప్ర‌ధానితో భేటీ.. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకున్న స్టార్ క్రికెట‌ర్‌

మోదీ పర్యటన షెడ్యూల్ ఇలా..
– ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ బయలుదేరుతారు. 9.25గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
– 9.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 10.15 గంటలకు మామునూర్ హెలిప్యాడ్ కు ప్రధాని మోదీ చేరుకోనున్నారు.
– అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రకాళి టెంపుల్ కు 10.30 గంటలకు చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10.45 గంటల వరకు ప్రధాని ఆలయంలో ఉంటారు.
– 10.50 గంటలకు భద్రకాళి దేవాలయం నుంచి బయలుదేరి 11గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.
– 11.35 గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
– 11.45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.20 వరకు ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొంటారు.
– మధ్యాహ్నం 12.25 గంటలకు మోదీ రోడ్డు మార్గం ద్వారా హెలిప్యాడ్ వద్దకు వెళ్తారు.
– 1.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 3.25 గంటలకు రాజస్థాన్ లోని బికనీర్ కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తారు.

ట్రెండింగ్ వార్తలు