Primitive Human Signs : హైదరాబాద్ లో ఆదిమానవుని ఆనవాళ్లు.. 6 వేల ఏళ్ల నాటి రాతి గొడ్డళ్లు

జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా శనివారం తాబేలు గుండును పరిశోధించారు. అయితే ఆ గుండు కింద రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని వెల్లడించారు.

Hyderabad Jubilee Hills : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని బీఎన్ఆర్ హిల్స్ వద్ద తాబేలు గుండు కింద కొత్త రాతియుగపు ఆనవాళ్లు గుర్తించారు. ఈ మేరకు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోని విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా శనివారం తాబేలు గుండును పరిశోధించారు. అయితే ఆ గుండు కింద రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని వెల్లడించారు. దీనిని బట్టి హైదరాబాద్ కు 6 వేల ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తోందని చెప్పారు.

Historical Primitives Landmarks : సిద్దిపేటలో ఆదిమానవుడి ఆనవాళ్లు.. 15వేల ఏళ్ల నాటి పురాతన వస్తువులు

గతంలో కూడా దేశంలోని అనేక చోట్ల ఆదిమానవుని ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ తవ్వకాల్లో ఆదిమానవులు ఉపయోగించిన పాత్రలు, పనిముట్లను గుర్తించారు. అలాగే తవ్వకాల్లో ఆదిమానవుల సమాధులు కూడా  బయటపడిన సంఘటనలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు