Private Colleges: తెలంగాణలోని ఇంజనీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కాలేజీలను వచ్చే నెల 3 నుంచి బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
ఈ మేరకు ప్రభుత్వానికి బుధవారం నోటీసు అందజేస్తామని తెలిపింది. ప్రైవేట్ కాలేజీల సమాఖ్య కోర్ కమిటీ ఆదివారం సమావేశమై, తమకు ఎదురవుతున్న సమస్యలపై చర్చించింది.
Also Read: NTA JEE Main 2026: ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల.. ఈ సారి 10 రోజుల ముందుగానే..
ఈ నెల 25న విద్యార్థి సంఘాలతో, ఆ తర్వాత 26న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య నిర్ణయించింది. నవంబరు 1 నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి భేటీ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావును ప్రైవేట్ కాలేజీల సమాఖ్య నేతలు కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఫీజుల రీయింబర్స్ రాని కాలేజీలకు వెంటనే చెల్లించాలని అన్నారు. మైనార్టీ కాలేజీల బకాయిలను కూడా రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సర్కారు ఇచ్చిన హామీ మేరకు రూ.900 కోట్లను వచ్చేనెల 1వ తేదీలోపు విడుదల చేయాలని అన్నారు. అలాగే, పెండింగ్‌లోని మొత్తం రీయింబర్స్‌మెంట్ బకాయిలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1లోగా ఇవ్వాలని చెప్పారు.