Degree Colleges : తెలంగాణలో ఆగని డిగ్రీ కాలేజీల మూసివేత

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు వరుసగా మూతపడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది కూడా 45 డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి.

Degree Colleges

Degree Colleges : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు వరుసగా మూతపడుతున్నాయి. వరుసగా మూడో ఏడాది కూడా 45 డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతపడుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన సరిగా లేకపోవడం, కనీస ఫ్యాకల్టీ లేకపోవడంతో వరుసగా మూడేళ్లుగా జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలను మూసివేయాల్సిందిగా ఉన్నత విద్యా మండలి ఆదేశించింది.

Andhra Pradesh: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక కాలేజీలు మూతపడ్డాయి. అయితే, ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన విద్యను అందిస్తున్నంద వల్లే ప్రైవేట్ కు ఎవరూ వెళ్లడం లేదని, ఆయా కాలేజీలు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అంటున్నారు. దోస్త్ ద్వారా పారదర్శకంగా సీట్లను భర్తీ చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, గత విద్యా సంవత్సరంలో 60కి పైగా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw