Andhra Pradesh: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 50మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏవైనా రెండు సబ్జెక్టుల్లో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి బెటర్ మెంట్ రాసుకునే అవకాశాన్ని కల్పించింది.

Andhra Pradesh: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

Ap 10th Studient

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతి విద్యార్థులకు బెటర్ మెంట్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల విభాగానికి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 50మార్కుల కంటే తక్కువ వచ్చిన ఏవైనా రెండు సబ్జెక్టుల్లో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి బెటర్ మెంట్ రాసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ అవకాశం ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికేనంటూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Ap Government: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ‘బైజూస్‌’తో ఒప్పందం.. జగన్ కీలక వ్యాఖ్యలు

ఇందుకుగాను సబ్జెక్ట్ కు రూ.500 చొప్పున రెండు సబ్జెక్టులకు రూ. వెయ్యి ఫీజు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే టెన్త్ పరీక్షలకు బెటర్ మెంట్ అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే బెటర్మెంట్ అవకాశం ఉంది. ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. రెండేళ్ల కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. దీనికితోడు పాస్ అయినవారిలోనూ మార్కులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం తీరు వల్లనే అధికశాతం మంది పదవ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

Rats stole Gold: బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఎలుకలు.. ఎలా గుర్తించారంటే..

ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నుంచేకాక పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థుల సౌలభ్యం కోసం బెటర్ మెంట్ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.