Prof Haragopal
Haragopal – Sedition Case : సమాజం చైతన్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తాను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఇటువంటి కేసులపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూస్తానని చెప్పారు. హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఉపా సహా పలు కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీనిపై ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. ఉద్యమపార్టీ అని కేసీఆర్ పార్టీని గౌరవించామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక ఉద్యమాల నుంచి వచ్చింది కాబట్టి ఆ పార్టీ పాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటుందని అనుకున్నామని చెప్పారు.
తాము ఏది చేసినా చెల్లుతుందని పోలీసులు భావిస్తున్నారని తెలిపారు. సర్కారుని విమర్శిస్తే అది రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదని హరగోపాల్ అన్నారు. రాజద్రోహం కేసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడాలని ఆయన అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు పెట్టడంతో దీనిపై పలువురు నేతలు మండిపడుతున్నారు.
Telangana High Court : డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు