ఆ ప్రచారం వల్లే ఎన్నికల్లో దెబ్బతిన్నాం: 10టీవీ ఓపెన్‌ డిబేట్‌లో ఎంపీ అర్వింద్‌

Dharmapuri Arvind: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుకు, బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు.

బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ అన్న ప్రచారం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని ఎంపీ అర్వింద్ చెప్పారు. 10టీవీ ఓపెన్‌ డిబేట్‌లో ఎంపీ అర్వింద్‌ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల వేళ కాకుండా.. నాలుగు నెలల ముందే బండి సంజయ్ ను మార్చితే బాగుండేదని చెప్పారు. ఆయనను మార్చడం ఒక్కటే ఎన్నికల్లో తమ ఓటమికి కారణం కాదని తెలిపారు.

ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీజేపీ బలపడలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుకు, బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు పదేళ్లలో అవినీతిని అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు.

Uttam Kumar Reddy : ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం- మంత్రి ఉత్తమ్

ట్రెండింగ్ వార్తలు