Uttam Kumar Reddy : ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం- మంత్రి ఉత్తమ్

గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.

Uttam Kumar Reddy : ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం- మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 272 స్థానాల కన్నా ఎక్కువ గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ జూన్ 9న ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏదో దీక్షా చేశారు అని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. ధాన్యం కొనుగోలు.. రేషన్ సరఫరాలో పూర్తిగా సమర్ధవంతంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

”తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు సమర్ధవంతంగా ఈ ఏడాది తప్ప ఎప్పుడూ జరగలేదు. ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేశాం. ఇది మా గ్యారంటీ. ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. 2022-23 ఏప్రిల్ 9న ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మార్చి 23నే ప్రారంభించాం. గతేడాది 7031 ఉంటే ఇప్పుడు 7,149 ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 6వేల 919 కేంద్రాలు ప్రారంభించాం. ఈ సమయానికి గతేడాది 335 ధాన్యం కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. నిన్నటివరకు మొత్తం ధాన్యం కొనుగోలు 2,69,699 మెట్రిక్ టన్నుల చేశాం. మారుమూల గ్రామం అయినా కనీస మద్దతు ధరతో చివరి గింజ కొనుగోలు చేస్తాం. సిద్దిపేటలో గతేడాది ఈ సమయానికి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉంచాం.

కొన్ని చోట్ల ట్రెడర్స్ MSP కన్నా ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం. ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం. ప్రభుత్వానికి అదే ధాన్యం వేలంలో అదనపు ఆదాయం వస్తుంది. దేశ చరిత్రలో 70 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. తప్పకుండా అన్ని గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం. అమలు చేస్తాం. 100 హామీలు ఇచ్చి పదేళ్లలో అమలు చేయలేదు. మేము 5 హామీలను 70 రోజుల్లో అమలు చేశాం” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

Also Read : వారికి లైన్ క్లియర్..! పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్