Telangana Congress : వారికి లైన్ క్లియర్..! పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

Telangana Congress
Telangana Congress Party : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలో చేరికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించింది. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే, జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు అడ్డుపడుతున్నారు. అదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి చేరికను స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ చేరికకు స్థానిక పార్టీ నేతలు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో సంగిశెట్టి జగదీశ్, రంగారెడ్డి జిల్లాలో దండం రామ్ రెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Also Read : కేటీఆర్‌ని ఇంటర్వ్యూ చేసిన ఘంటా చక్రపాణి.. ఏమేం చెప్పారో తెలుసా?
పలు జిల్లాల్లో ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందు వస్తున్నప్పటికీ స్థానిక ముఖ్యనేతలు అడ్డు చెబుతుండటంతో వారి చేరికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా అన్ని స్థాయిల్లో నేతలను పార్టీలో చేర్చుకోవాలని కేసీ వేణుగోపాల్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వస్తున్న నేతలకు అడ్డుచెప్తే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని, ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారిని పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ నేతలకు వేణుగోపాల్ సూచించారు. దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్న నేతలకు లైన్ క్లియర్ అయినట్లయింది.
Also Read : Congress Govt : కాంగ్రెస్ సర్కార్ను కలవరపెడుతున్న కరువు పరిస్థితులు