Software Employee Death : సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి అనుమానాస్పద మృతి కేసు.. పోలీసుల అదుపులో చెల్లెలుతోపాటు మరో యువకుడు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి ది హత్య ? ఆత్మహత్య ? ఆమె చెల్లెలు పాత్ర ఉందా ఆనే కోణంలో విచారణ చేస్తున్నారు.

software employee Deepti death
Korutla Software Employee Death : జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఒంగోలులో మృతురాలి చెల్లెలు చందనతో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం అక్క దీప్తి మృతి చెందగా, చెల్లెలు చందన మిస్సింగ్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీప్తి ది హత్య ? ఆత్మహత్య ? ఆమె చెల్లెలు పాత్ర ఉందా ఆనే కోణంలో విచారణ చేస్తున్నారు.
కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి దీప్తి తన ఇంట్లో అనుమానాస్పద మృతి, ఆమె చెల్లెలు అదృశ్యమైన అయిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల దీప్తి యువతి హైదరాబాద్ లోని మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ల్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్లోని తన నివాసంలో బి.దీప్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె చెల్లెలు చందన మేడ్చల్ లో బీటెక్ చదువుతున్నారు. చందన అదృశ్యం అయ్యారు. అయితే ఇంట్లో 30 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు మాయమైనట్లు పేర్కొన్నారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. బి.దీప్తి ఇంటి నుంచి పని చేస్తున్నారు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు గ్రహప్రవేశం కార్యక్రమానికి హైదరాబాద్ కు వెళ్లారు. అయితే అక్క దీప్తితోపాటు, చెల్లెలు చందన(20) కూడా ఇంట్లోనే ఉన్నారు. సోమవారం రాత్రి ఇద్దరు కూతుళ్లతో ఫోన్‌లో మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెప్పారు. తాము హైదరాబాద్ నుంచి మంగళవారం తిరిగి వస్తామని చెప్పామని తండ్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు దీప్తికి ఫోన్ చేయగా ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. చందనకు కాల్ చేస్తే ఆమె ఫోన్ స్విచ్చాఫ్ గా వచ్చిందన్నారు. దాంతో తమ ఇంటిచుట్టు పక్కల ఉన్న పరమ్ జ్యోతి, ఆయన భార్య రూపకు ఫోన్ చేసి తమ కూతుర్లు ఫోన్ ఎత్తడం లేదని, ఇంట్లోకి వెళ్లి చూడాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
Jagtial : అక్క అనుమానాస్పద మృతి, చెల్లెలు అదృశ్యమైన ఘటన.. ఇంట్లో 30 తులాల బంగారం, రూ.2 లక్షలు మాయం
అప్పుడు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా దీప్తి గదిలోని సోఫాలో యువతి మృతదేహాన్ని చూశారు. కిచెన్ లో మద్యం బాటిల్స్ ఉండటాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని వారు యువతి తల్లిదండ్రులకు తెలియజేశారు. అనంతరం యువతి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఇంట్లో 30 తులాల బంగారం, రూ.2 లక్షలు మాయమైనట్లు తల్లిందండ్రులు పేర్కొన్నారు. కాగా, మృతురాలు దీప్తి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని మెట్ పల్లి డీఎస్పీ రవిందర్ రెడ్డి తెలిపారు. అయితే ఆమెకు విషమిచ్చి ఉండవచ్చు లేదా ఊపిరిరాడకుండా చేయొచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె మృతికి గల కచ్చితమైన కారణం పోస్టుమార్టం చేసిన తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు.