Father, Daughter Suspicious Death : జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద మృతి.. వ్యవసాయ బావిలో కుమార్తె మృతదేహం లభ్యం

జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయం బావి దగ్గర తండ్రి మృతదేహం కనిపించగా, బావిలో కూతురు మృతదేహం లభ్యమైంది.

Father, Daughter Suspicious Death : జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద మృతి.. వ్యవసాయ బావిలో కుమార్తె మృతదేహం లభ్యం

Jagityala

Updated On : February 4, 2023 / 1:54 PM IST

Father, Daughter Suspicious Death : జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయం బావి దగ్గర తండ్రి మృతదేహం కనిపించగా, బావిలో కూతురు మృతదేహం లభ్యమైంది. మరో కూతురు కోసం గాలిస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది.

జలపతి రెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నిన్న ఇంటి నుంచి జగిత్యాలలో ఓ ఫంక్షన్ కు వెళ్లారు. అయితే ఫంక్షన్ వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. ఈ క్రమంలో నర్సింగపూర్ గ్రామ శివారులో వ్యవసాయి బావి దగ్గర జలపతిరెడ్డి మృతదేభహాన్ని గుర్తించారు.

Hyderabad: భాగ్యనగరంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి.. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి

బావిలో ఒక కూతురు మృతదేహం లభ్యం అయినట్లు తెలుస్తోంది. కాగా, మరో కూతురు కూడా కనిపించకుండా పోయారు. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. నిన్న ఫంక్షన్ కు వెళ్లిన వారంతా ఏమైపోయారు? ఏం జరిగిందన్న విషయంపై సస్పెన్షన్ కొనసాగుతోంది.