Python: వామ్మో.. నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరిన కొండ చిలువ.. ఏదో కదులుతున్నట్లు అనిపించడంతో..

పట్టబడిన కొండ చిలువ పొడవు ఏడు ఫీట్లు, 13 కిలోల బరువు ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Python

Python: కొండచిలువ సంచరించే పరిసరాల్లో ఉండాలంటేనే భయంతో వణికిపోతాం. అదే కొండ చిలువ ఇంట్లోకి వస్తే.. అదే కొండ చిలువ ఇంట్లో నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరితే.. ఇక అంతేసంగతులు. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇలాంటి ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read: పక్కింట్లోని యువకుడితో ఎఫైర్.. భర్తకు తెలియడంతో చంపేసి ఇంట్లో టైల్స్ కింద పాతిపెట్టిన భార్య.. మరిది ఎంట్రీతో అసలు గుట్టురట్టు.. పోలీసుల విచారణలో..

పెబ్బేరు పట్టణం చెలిమిళ్ల కాలనీలో సోమవారం తెల్లవారు జామున ఈ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లూరు చెన్నకేశవులు ఆదివారం రాత్రి ఇంటి వరండాలో పరుపు వేసుకొని పడుకున్నాడు. సోమవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో కుక్కలు అరుస్తుండటంతో చెన్నకేశవులు నిద్రలేశాడు. అయితే, పరుపులో ఏదో కదులుతున్నట్లుగా అతనికి అనిపించింది. ఏంటాఅని పరుపు కాస్త పైకెత్తి చూడగా.. కొండచిలువ ఉండటాన్ని గమనించాడు.

ఒక్కసారిగా భయాందోళనకు గురైన యువకుడు.. గట్టిగా కేకలు వేసుకుంటూ అక్కడ నుంచి పరుగెత్తాడు. విషయాన్ని కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారంతా అక్కడి వచ్చి చూడగా.. పరుపులో కొండ చిలువ కనిపించింది.

వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ కు విషయాన్ని తెలియజేశారు. తన సిబ్బందితో అతను ఘటన స్థలికి చేరుకొని కొండ చిలువను బంధించారు. అటవీ అధికారుల సమక్షంలో కొండచిలువను అడవిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు.

పట్టబడిన కొండ చిలువ పొడవు ఏడు ఫీట్లు, 13 కిలోల బరువు ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంటిబయట పడుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు సూచించారు.