భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఆగ్రహంతో ఇల్లు తగలబెట్టిన భర్త.. వీడియో వైరల్

పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని దగ్దమైన ఇంటిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

house was completely burnt

Rajanna Sirisilla District : భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ చిలికిచిలికి గాలివానలా మారింది. ఇరువురు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. ఏకంగా ఇంట్లోని కిరోసిన్ పోసి ఇంటికి నిప్పంటించాడు. ఈఘటనలో భార్యాభర్తలు స్వల్ప గాయాలతో బయటపడగా.. ఇల్లు మాత్రం పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పద్మనగర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : నూజివీడు మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి.. పోలీసులు ఏం చేశారంటే?

పద్మనగర్ గ్రామానికి చెందిన బాల పోచయ్య , రాజేశ్వరి భార్యాభర్తలు. వీరికి మధ్యాహ్న భోజనం విషయంలో ఘర్షణ తలెత్తింది. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో భర్తకు కోపం కట్టలు తెచ్చుకుంది. దీంతో సహనం కోల్పోయి పోచయ్య ఇంట్లో కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఇంట్లో ఉన్న భార్య వెంటనే అప్రమత్తమై ఇంటి వెనుకనుంచి బయటకు వచ్చేసింది. అప్పటికే ఇల్లంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లి మంటలు అంటుకోవటంతో చుట్టుపక్కలవారు గమనించి వెంటనే ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు.

Also Read : ఏపీలో వైఎస్సార్ విగ్రహాలపై దాడులు.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

మంటలకు ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్దమయ్యాయి. అయితే, రాజేశ్వరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని దగ్దమైన ఇంటిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షణికావేశంతో భర్త చేసినపనికి ఇల్లు, ఇంట్లోని సామాన్లు దగ్ధమయ్యాయి. భార్య రాజేశ్వరి అప్రమత్తమై తప్పించుకోకుంటే ఆమె ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లేదని స్థానికులు పేర్కొంటున్నారు.