నూజివీడు మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి.. పోలీసులు ఏం చేశారంటే?

నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు.

నూజివీడు మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పద మృతి.. పోలీసులు ఏం చేశారంటే?

Suspicious Death

YSRCP Sarpanch Husband Suspicious Death : నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి అనుమానాస్పద మృతి చెందాడు. ఆయన మృతికి బెట్టింగ్ లే కారణంగా తెలుస్తోంది. సుమారు 30కోట్ల వరకు ఎన్నికల ఫలితాల బెట్టింగ్ లో వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి గ్రామంలో కనిపించకుండా పోయాడు. దీంతో రెండు రోజుల క్రితం పందెం రాయుళ్లు వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇవాళ గ్రామంలో మల్బరీ షెడ్ లో అనుమానాస్పద స్థితిలో వేణుగోపాల్ రెడ్డి శవమై కనిపించాడు.

Also Read : వ్యక్తి కాదు శక్తి…! ఇక సెలవంటూ నిష్క్రమించిన మేరుపర్వతం రామోజీరావు

వేణుగోపాల్ రెడ్డి చనిపోవడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే, వేణుగోపాల్ రెడ్డి మరణానికి బెట్టింగ్ లే కారణమని స్థానికులు చెబుతున్నారు.