Rahul Gandhi
Rahul Gandhi Interaction with workers : తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు హైదరాబాద్ లో ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్ భేటీ అయ్యారు.
ఆటో డ్రైవర్స్, జీహెచ్ఎంసీ వర్కర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేశారు. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్ తో మాటా మంతిగా మాట్లాడారు. డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తమ తమ కష్టాలు, ఇబ్బందులను రాహుల్ కు చెప్పుకున్నారు. సంపాదించినందంతా డీజిల్, పెట్రోల్ లకే సరిపోతుందని రాహుల్ కు ఆటో డ్రైవర్లు చెప్పారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు లేవన్నారు.