Telangana Rains
Surface Trough – Monsoons : నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది.
ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.
Two New Mandals : తెలంగాణలో మరో రెండు కొత్త మండలాలు
నైరుతి దిశగా ఉపరితల గాలులు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడిచింది. గత 24 గంటల్లో మహబూబాద్ జిల్లా గార్ల, మెదక్ జిల్లా రేగోడ్ లో 4 సెంటీమీటర్ల, భద్రాచలం, కొత్తగూడెంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.