Rains In Hyderabad: హైదరాబాద్‎లో భారీ వర్షం… రోడ్లన్నీ జలమయం

Rains In Hyderabad: కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, రాజేంద్రనగర్‌లోనూ..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లిలో వర్షం పడింది. ఎల్బీనగర్‌ ప్రధాన రహదారిపై భారీగా నిలిచింది నీరు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది పంజాగుట్ట, అమీర్ పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, లక్డీకపూల్, అసెంబ్లీ, సెక్రటేరియట్. హిమాయత్ నగర్, నారాయణ గూడలో వాన కురిసింది.

కుత్బుల్లాపూర్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, రాజేంద్రనగర్ లోనూ వర్షం పడింది. మలక్ పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. వాహనాలు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు

ట్రెండింగ్ వార్తలు