రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో ముగిసిన సోదాలు..

రాజ్ పాకాలను రెండు గంటల పాటు మోకిల పోలీస్ స్టేషన్ లో విచారించిన తర్వాత.. ఆయన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు.

Raj Pakala Farm House Party Case (Photo Credit : Google)

Raj Pakala Farmhouse Party Case : మోకిలలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఫామ్ హౌస్ లో సుమారు గంట పాటు పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాలు ముగియడంతో రాజ్ పాకాలను పోలీసులు తిరిగి మోకిల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫామ్ హౌస్ మొత్తం మరోసారి తనిఖీలు చేశారు పోలీసులు. ఫామ్ హౌస్ లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో విజయ్ మద్దూరి మొబైల్ ఫోన్ కోసం కూడా పోలీసులు ఆరా తీశారు.

రాజ్ పాకాలను రెండు గంటల పాటు మోకిల పోలీస్ స్టేషన్ లో విచారించిన తర్వాత.. ఆయన ఫామ్ హౌస్ కి తీసుకెళ్లారు. అక్కడ సుమారు గంట పాటు ఆయన సమక్షంలో ఫామ్ హౌస్ లో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా ఉదయం నుంచి విచారణ సాగింది. ఈ కేసులో విజయ్ మద్దూరి ఫోన్ చాలా కీలకంగా మారింది.

సుమారు రెండు గంటల పాటు మోకిల పోలీస్ స్టేషన్ లో రాజ్ పాకాలను విచారించిన పోలీసులు.. తర్వాత ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడ రాజ్ సమక్షంలో సోదాలు చేశారు. కాగా, అక్కడ ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి మరోసారి పాకాలను మోకిల పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు పోలీసులు. న్యాయవాది సమక్షంలో విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ మద్దూరి స్టేట్ మెంట్ ఆధారంగా ఈ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్ లో ఏం జరిగింది? విజయ్ మద్దూరి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాఫ్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఫామ్ హౌస్ లోనే డ్రగ్స్ తీసుకున్నారా? లేక మరో చోట డ్రగ్స్ తీసుకుని ఫామ్ హౌస్ లో పార్టీకి వచ్చారా? అనేది పోలీసులు నిర్ధారించుకోవాల్సి ఉంది. విజయ్ మద్దూరి ఫోన్ లభిస్తేనే.. ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే రాజ్ పాకాలను ఈ కేసులో ఏ-1గా చేర్చారు పోలీసులు. అతడిచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే ఉదయం నుంచి విచారణ సాగినట్లుగా సమాచారం.

పోలీసులు అడిగిన ప్రశ్నలకు రాజ్ పాకాల సమాధానం చెప్పారా లేదా? ఆ రోజు ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు? లిక్కర్ పార్టీలో లిక్కర్ కాకుండా ఇంకేమైనా వినియోగించారా? అనే కోణంలో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. రాజ్ పాకాల సమక్షంలో పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో ప్రతీ ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ విజయ్ మద్దూరి ఫోన్ ఫామ్ హౌస్ లో ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాఫ్తు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం.

 

Also Read : ఫాంహౌస్‌ కేసులో పైచేయి సాధించిందెవరు.?