KTR Farm House Case : ఫాంహౌస్ కేసులో పైచేయి సాధించిందెవరు.?
ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుని..బౌన్స్ బ్యాక్ అయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడుతోన్న బీఆర్ఎస్‌కు అనుకోని కష్టం వచ్చి పడింది.

Who the upper hand in the farmhouse case
ఓ చిన్న పార్టీ కేసీఆర్ ఫ్యామిలీని రచ్చకీడ్చింది. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుని..బౌన్స్ బ్యాక్ అయి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాడుతోన్న బీఆర్ఎస్‌కు అనుకోని కష్టం వచ్చి పడింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ తీసుకున్నారన్న వార్తలతో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. దీనిపై మొదట గులాబీ పార్టీ నేతలు కూడా స్పందించడానికి ముందుకు రాలేదు. రైడ్స్ రోజు సాయంత్రానికి సీన్ మారిపోయింది. ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ దొరకలేదని చెప్పడం..స్నిపర్ డాగ్స్‌తో వెతికినా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదని క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు బీఆర్ఎస్ నేతలు. మెల్లిగా ఫాంహౌస్ కేసులో సీన్ సితార అయిపోయింది. అక్కడ డ్రగ్స్ లేవని..ఫ్యామిలీ ఫంక్షన్ అని చిన్నగా అందరికి స్పష్టత వచ్చేసింది.
సాయంత్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి..క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఫ్యామిలీ ఫంక్షన్ పైగా వృద్ధురాలు నుంచి రెండేళ్ల పిల్లల వరకు ఉన్నారు. ఎలా రేవ్ పార్టీ అని నిర్ధారిస్తారని మండిపడ్డారు. అంతేకాదు 13మంది టెస్ట్ చేస్తే ఒక్కరికి పాజిటివ్ వస్తే డ్రగ్స్ పార్టీ అని గోల చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిన విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించడంతో..కాంగ్రెస్ ప్రభుత్వం కార్నర్ అయిన పరిస్థితి వచ్చేసింది.
రాజ్ పాకాల ఫాంహౌస్‌పై పోలీసుల దాడులు, కేసు నమోదు చేయడంపై సాఫ్టువేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాజ్ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన సోదాల్లో విజయ్ మద్దూరికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాజ్ పాకాలతో పాటు, విజయ్ మద్దూరిపై పోలీసులు కేసు పెట్టారు. కేటీఆర్ బావమరిది తనకు మద్యం ఇవ్వడంతో తాను తీసుకున్నానని విజయ్ వాంగ్మూలం ఇచ్చినట్లుగా పోలీసులు చెప్పారు. ఆ వాంగ్మూలం తప్పంటున్నారు విజయ్ మద్దూరి. తాను అనని మాటలను పోలీసులు FIRలో నమోదు చేశారని చెప్పాడు. ఫాంహౌస్‌లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగలేదని వెల్లడించాడు. దీంతో కేసు ఎటుదారి తీస్తుందోనన్న ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు రాజ్‌పాకాల హైకోర్టులో పిటిషన్ వేయడం..ఆయనకు కోర్టు సమయం ఇచ్చింది. సేమ్‌టైమ్ విజయ్ మద్దూరి ఫోన్ స్విచ్చాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడని అంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేసుపై రకరకాల చర్చ జరుగుతున్నాయి. అసలు రాజ్‌పాకాల కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం ఎందుకు..విజయ్ మద్దూరి ఎందుకు పారిపోయారన్న చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్‌ను టార్గెట్ చేయబోయి తమను ఇరికాస్తరని భయపడే ఆ ఇద్దరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఫాంహౌస్ కేసుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. రాజ్ పాకాల ఏం చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారో చెప్పాలంటున్నారు రేవంత్. ఇంటి దావత్ చేస్తే క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ ఎక్స్‌పైరీ మెడిసిన్ లాంటోడని..వన్ ఇయర్‌లో కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశానని..ఆ తర్వాత బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తానన్నారు. హరీశ్‌ను ఎలా డీల్ చేయాలో తమకు తెలుసు అంటూ హాట్ కామెంట్స్ చేశారు రేవంత్. అయితే సీఎం కామెంట్స్‌లోనూ ఫ్రస్టేషన్ కనిపిస్తుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫాంహౌస్ కేసులో కథ అడ్డం తిరగడంతో బద్నాం చేయబోయి బద్నా అయ్యామని రేవంత్ కక్కలేక, మింగలేకపోతున్నారని అంటున్నారు. ఆ ఫ్రస్టేషన్ నుంచి బయటపడేందుకే సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫాంహౌస్ కేసులో రైడ్స్ నుంచి సీఎం కామెంట్స్ వరకు బీఆర్ఎస్ నేతల రియాక్షన్ వరకు ఈ కేసులో ఏం జరిగిందేందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. రేవంత్ సర్కార్ ఏదో చేయబోయి పబ్లిక్ ముందు దోషిగా నిలబడిందని బీఆర్ఎస్ అంటుంటే..ఏ తప్పు చేయకపోతే కేటీఆర్ బామ్మర్ధి ఎందుకు తప్పించకపోయినట్లో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇలా మాటకు మాట..పొలిటికల్ డైలాగ్స్‌తో ఫాంహౌస్ కేసు రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది.