Raja Singh : గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో చెప్పేసిన రాజాసింగ్

బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో ఆయన చెప్పేశారు.

Raja Singh (Photo - Twitter)

Raja Singh – Goshamahal : బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో ఆయన చెప్పేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిని నేనే అంటున్నారు రాజాసింగ్. గోషామహల్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేది నేనే.. గెలిచేది కూడా నేనే అని విశ్వాసం వ్యక్తం చేశారాయన. అంతేకాదు బీఆర్ఎస్ తో మరో యుద్ధానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపు కూడా ఇచ్చారు రాజాసింగ్.

బీజేపీ హైకమాండ్ తో పాటు తనకు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల మద్దతుందని రాజాసింగ్ చెప్పారు. గోషామహల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంఐఎం డిసైడ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. 2108లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ ను ఎంఐఎం పెట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించని నాలుగు స్థానాల్లో గోషామహల్‌ ఒకటన్న రాజాసింగ్.. ఆ అభ్యర్థిని ప్రకటించేది కేసీఆర్ కాదు, ఎంఐఎం పార్టీయే ఆ స్థానానికి అభ్యర్థిని ప్రకటిస్తుందన్నారు. మజ్లిస్‌ ఎవరి పేరు చెబితే కేసీఆర్ ఆ పేరును ప్రకటిస్తారన్నారు.

Also Read..BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..

”తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో గోషామహల్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని మజ్లిస్ పార్టీ నిర్ణయిస్తుంది. అందుకే కేసీఆర్ ప్రకటించలేదు. ఇక్కడి అభ్యర్థిని సీఎం కేసీఆర్ నిర్ణయించరు. 2018లోనూ మజ్లిస్ పార్టీయే అభ్యర్థిని నిర్ణయించింది. నన్ను ఓడించేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. కానీ ఈసారి కూడా బీజేపీ నుంచి నేనే పోటీలో ఉంటున్నా. హ్యాట్రిక్ కొడతా. బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి పెద్దల ఆశీర్వాదం నాకుంది. నా గోషామహల్ కార్యకర్తల్లారా. సిద్ధం కండి.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టి, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొద్దాం” అని రాజాసింగ్ పిలుపునిచ్చారు.

Also Read..BRS List: రాజయ్యకు మొండిచేయి.. రేఖా నాయక్ కు షాక్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు మీదున్నారు. ఎన్నికలకు సమరశంఖం పూరించారు. అందరికన్నా ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించేశారు. ఏకంగా 115 నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేశారు. కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. అందులో గోషామహల్ నియోజకవర్గం ఒకటి. పలు కారణాలతో ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు కేసీఆర్ చెప్పారు. ఇక కేసీఆర్ ఈసారి కామారెడ్డి, గజ్వేల్ నుండి పోటీ చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు