Rajinikanth: రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణమేంటో చెప్పిన రజనీకాంత్.. వెంకయ్య నాయుడుపై కీలక వ్యాఖ్యలు..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడును ఎంపిక చేయడం తనకు నచ్చలేదని అన్నారు. ఇందుకు కారణాన్ని రజనీ వెల్లడించారు. ఇదే సమయంలోనే చివరి నిమిషంలో తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందోకూడా రజనీకాంత్ వెల్లడించారు.

Rajinikanth: తమిళనాడులోనేకాక తెలుగు రాష్ట్రాల్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లోకి రజనీకాంత్ రావాలని విపరీతమైన డిమాండ్ ఉంది. గత ఎన్నికల సమయంలో ఆయన కొత్త పార్టీ పెడతారని అందరూ భావించారు. అందుకు రజనీకాంత్‌కూడా సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషంలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను విరమించుకున్నారు. ఎందుకు అకస్మాత్తుగా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో, అందుకు కారణం ఏమిటో సెపియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రజనీకాంత్ వెల్లడించారు. పొలిటికల్‌ ఎంట్రీ రెడీ అయిన సమయంలో కరోనా వచ్చిందని, రాజకీయాల్లో రావాలనే ప్లాన్‌లో ఉన్నప్పుడు డాక్టర్లు కీలమైన సూచనలు చేశారని రజనీ అన్నారు. వారు చెప్పిన కారణాలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటం జరిగిందని రజనీకాంత్ అన్నారు.

Rajinikanth: సిస్టర్ సెంటిమెంట్‌కే సీనియర్ హీరోల ఓటు.. ఆడియెన్స్ ఏమంటారో?

వైద్యుల చెప్పిన విషయాల ప్రకారం.. రాజకీయాల్లోకి వచ్చామంటే నిత్యం ప్రజల్లో ఉండాల్సి వస్తుందని, అయితే, ప్రజలను కలిసే సమయంలో పది అడుగుల దూరం ఉండాలని, మాస్క్‌ వేసుకోవాలని సూచించారని రజనీకాంత్ చెప్పారు. దీనికితోడు, తన ఆరోగ్య పరిస్థితి రీత్యా పొలిటికల్‌ ఎంట్రీ‌పై ఆలోచించి అడుగు వేయాలని సూచించారని, దానికి ప్రధాన కారణం.. అప్పటికే కిడ్నీ సమస్య ఉండటం. దానికి తోడు కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నప్పుడు జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదని సూచించారని అన్నారు. రాజకీయాల్లోకి రాకపోవడానికి అసలు నిజం నా ఆరోగ్యం సహకరించకపోవడమేనని రజనీకాంత్ చెప్పారు.

Rajinikanth : జై భీమ్ దర్శకుడితో రజినీకాంత్ కొత్త సినిమా అనౌన్స్..

ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు. అయితే వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదని అన్నారు. ఆయన గొప్పనాయకుడు. ఉపరాష్ట్రపతి పదవితో ఆయన్ను రాజకీయాల నుంచి దూరం చేశారని రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు, చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయి. అలాఅని, నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు. వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేది అని రజనీకాంత్ అన్నారు. చిన్న మచ్చకూడా లేకుండా రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని రాజనీకాంత్ కొనియాడారు.

ట్రెండింగ్ వార్తలు