సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తాం.. చేతనైతే టచ్ చేసి చూడు : సీఎం రేవంత్

అధికారంలోకి వస్తేఅని మాట్లాడుతున్నాడు.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలే.. ఇక మీరు చింతమడకకే పరిమితం.

CM Revanth Reddy

CM Revanta Reddy : దేశంకోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలో జరిగిన జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. 1980 దశకంలోనే దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. మహాత్మాగాంధీ స్పూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు.

Also Read : తెలంగాణలో మరో రాజకీయ వివాదం.. పూర్తి వివరాలు ఇదిగో..

సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామంటే.. కొంతమంది సన్నాసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంకోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేసితీరుతాం. బీఆరెఎస్ నేతలకు అధికారంపోయినా బలుపు తగ్గలేదు. సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదని రేవంత్ అన్నారు. అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు.. చేతనైతే ఎవడైనా విగ్రహంపై చేయి వేయండి.. నీ అయ్య విగ్రహంకోసం రాజీవ్ విగ్రహాన్ని తొలగించాలని అంటావా? అంటూ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : మహిళల సమస్యలపై జట్‌ స్పీడ్‌లో కమిషన్ నిర్ణయాలు.. కేటీఆర్‌, వేణుస్వామి విషయంలో వేగంగా స్పందన

అధికారంలోకి వస్తేఅని మాట్లాడుతున్నాడు.. బిడ్డా.. మీకు అధికారం ఇక కలే.. ఇక మీరు చింతమడకకే పరిమితం. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత మాది. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించనవసరం లేదు. విచక్షణ కోల్పోయి అర్థంపర్ధం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సచివాలయం ముందు దొంగలకు, తాగుబోతులకు స్థానం లేదు. దేశ యువతకు స్ఫూర్తి ప్రధాత రాజీవ్ గాంధీ. రాబోయే కొద్ధి రోజుల్లో సచివాలయం ఎదురుగా పండుగ వాతావరణంలో రాజీవ్ గాంధీ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తాం.

సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీలో 16 మందికి ఒలింపిక్స్ పతకాలు వచ్చాయి. అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఒలింపిక్స్ లక్ష్యంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ ఏర్పాటు చేబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు