×
Ad

Rajiv Swagruha: గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటారా? చదరపు గజానికి కేవలం రూ.20 వేలే.. 

నిర్ణీత ధరావత్తు సొమ్మును డీడీ రూపంలో చెల్లించాలి. పూర్తి వివరాలను www.swagruha.telangana.gov.inలో చూడండి.

Representative Image (Image Credit To Original Source)

  • రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సువర్ణావకాశం  
  • ఎలాంటి వివాదాలులేని లేఅవుట్లలో ప్లాట్ల వేలం
  • చదరపు గజానికి రూ.20,000 నుంచే ధర ప్రారంభం 

Rajiv Swagruha: హైదరాబాద్ పరిధిలో ఇల్లు కట్టుకోవాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ఇక్కడి భూముల ధరలేమో ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేగాక, భూముల విషయంలో మోసాలు జరుగుతుండడంతో సామాన్యుడిలో ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ఇటువంటి వారి కోసం తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఓ సువర్ణావకాశం కల్పిస్తోంది.

ఎలాంటి వివాదాలు లేని, సర్కారు గుర్తింపు పొందిన లేఅవుట్లలో ప్లాట్లను వేలం వేయనుంది. వీటికి ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉండవు. మొత్తం 137 బహిరంగ ప్లాట్లను వేలం వేస్తుంది. ఆ కార్పొరేషన్‌ ఎండీ గౌతం తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఈ ప్లాట్లు ఉన్నాయి.

Also Read: KTR: అందరికీ ఆ మచ్చ అంటించాలని రేవంత్‌ రెడ్డి చూస్తున్నారు: కేటీఆర్

ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ కారిడార్‌కు దగ్గరలోని లేఅవుట్‌లో 105 ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో ప్లాటు 200-500 చదరపు గజాల విస్తీర్ణం మధ్య ఉన్నాయి. ఆ ప్రాంతంలో గజం కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) రూ.25,000గా అధికారులు నిర్ణయించారు. ఇక బహదూర్ పల్లి పరిధిలో ఇక్కడ 12 ప్లాట్లు 200-1000 చదరపు గజాల చొప్పున ఉన్నాయి.

సాధారణ ప్లాట్ గజం ధర రూ.27,000. కార్నర్ ప్లాట్ల ధర రూ.30,000. కుర్మల్ గుడలో 20 ప్లాట్లు ఉన్నాయి. చదరపు గజానికి కేవలం రూ.20,000 నుంచే ఈ భూమి ధర ప్రారంభమవుతుంది.

వచ్చే నెల 7-8న బహిరంగ వేలం నిర్వహిస్తారు. మీ సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకోవాలి. నిర్ణీత ధరావత్తు సొమ్మును డీడీ రూపంలో చెల్లించాలి. పూర్తి వివరాలను www.swagruha.telangana.gov.inలో చూడండి. లేదంటే రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ప్రతినిధులను కలిసి వివరాలను అడగండి.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి