Rajiv Yuva Vikasam: యువ వికాసం డబ్బులు ఎప్పుడు వస్తాయి?

అంచనాలు తలకిందులు అవ్వడం, టెక్నికల్‌గా సమస్యలు రావడంతో ఈ పథకం కింద యువతకు నగదు అందడం లేదని సమాచారం.

Rajiv Yuva Vikasam: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సర్కారు రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా యువత వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ పథకం అమలులో ఊహించని ప్రతిష్టంభన ఎదురవుతోంది. ప్రస్తుతం లక్షలాది మంది నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం కింద వచ్చే డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరూ నిరాశలో ఉన్నారు.

డబ్బులు ఇంకా అందకపోవడానికి కారణం ఆర్థిక అంచనాలు తారుమారు కావడం, అవసరాలు మూడింతలు పెరగడమేనని విశ్లేషకుల అంచనా.

Also Read: కొత్తగా కారు, బైక్ కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రూపకల్పన చేశారు. నిరుద్యుల నుంచి దరఖాస్తులు తీసుకుంది ప్రభుత్వం.

అయితే, ఆ తర్వాత అంచనాలు తలకిందులు అవ్వడం, టెక్నికల్‌గా సమస్యలు రావడంతో ఈ పథకం కింద యువతకు నగదు అందడం లేదని సమాచారం. నిధుల సమకూర్పులో ఇబ్బందులు కూడా వస్తుండడంతో ఈ పథకాన్ని తాత్కా లికంగా వాయిదా వేయక తప్పట్లేదు. యువ వికాసం డబ్బులు ఎప్పుడు వస్తాయన్న సందేహం నిరుద్యోగ యువతలో మెదులుతోంది.