Rasamayi Balakishan
Rasamayi Balakishan : హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజాగాయకుడు రసమయి బాలకిషన్ కు కేబినేట్ హోదా కల్పించారు. కేబినెట్(మంత్రి వర్గ) హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఇటీవలే రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. నెల తిరక్కముందే ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.