Real Estate : హైదరాబాద్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్ల రికార్డు.. డిసెంబర్‌లో రూ. 2,340 కోట్లు

కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

Real Estate House Registrations : కరోనా కష్టకాలంలోనూ రియల్ ఎస్టేట్ రంగం రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 2021 ఏడాదిలో డిసెంబర్ ఒక్క నెలలోనే అత్యధిక ఇళ్లు రిజిస్ట్రేషన్లు అయిన మెట్రో సిటీగా ఫస్ట్ ప్లేసులో నిలిచింది హైదరాబాద్.. డిసెంబర్ లో అమ్ముడైన ఇళ్ల యూనిట్ల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. 2021 ఏడాదికి సంబంధించి దేశంలోనే ఎక్కువ ఇళ్లు అమ్ముడైన మెట్రో సిటీగా మొదటి స్థానంలో నిలిచింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా (Knight Frank India) వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ సిటీలో 3,931 యూనిట్ల హౌస్ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా తగ్గాయి.

ఈ రిజిస్ట్రేషన్‌ విలువ మొత్తంగా డిసెంబర్ నెలలో రూ.2,340 కోట్లుగా నమోదైంది. 2020 ఏడాదిలో డిసెంబర్ లో జరిగిన రిజిస్ట్రేషన్లలో పోల్చితే.. 16 శాతం వృద్ధి చెందింది. డిసెంబరులో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 2,693, హైదరాబాద్‌ 1,180, సంగారెడ్డి 66 ఇళ్లుగా ఉన్నాయి. 2021లో మొత్తం రిజిస్ట్రేషన్ల ఇళ్ల సంఖ్య 96 శాతం వరకు పెరిగి 44,278 యూనిట్లకు చేరుకుంది. హైదరాబాద్‌లో (హైదరాబాద్, రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలతో సహా) నెలవారీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు డిసెంబర్ 2021లో 3,931 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్ 2020తో పోలిస్తే 0.5 శాతం స్వల్ప క్షీణతను నమోదు చేసినట్టు అని నైట్ ఫ్రాంక్ ప్రకటనలో తెలిపింది.

గతేడాది హైదరాబాద్‌ నగర పరిధిలో మొత్తం 44,278 ఇళ్ల రిజిస్ట్రేషన్‌ జరగగా వాటి విలువ రూ.25,330 కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం చుట్టుముట్టినా రియల్‌ ఎస్టేట్‌ రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. పూర్తి 2021 పూర్తి ఏడాదిలో నమోదైన మొత్తం ఇళ్ల సంఖ్య 44,278గా ఉండగా.. 2020తో పోలిస్తే.. 96 శాతం ఎక్కువగానే నమోదైనట్టు నివేదిక వెల్లడించింది. మొత్తం 2021లో నమోదైన ఆస్తుల విలువ రూ.25,330 కోట్లుగా ఉంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సిఎండి శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సమయంలో కూడా బాగా అభివృద్ధి సాధించిన మార్కెట్లలో హైదరాబాద్ సిటీ ఒకటి అన్నారు. గత కొన్ని త్రైమాసికాల్లో వాణిజ్య నివాస మార్కెట్లు రెండూ లాభసాటిగా సాగాయని బైజాల్ తెలిపారు.

Read Also : Bikaner-Guwahati Express : రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

ట్రెండింగ్ వార్తలు