Bikaner-Guwahati Express : రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు భారతీయ రైల్వే సంతాపం తెలియచేసింది. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి...

Bikaner-Guwahati Express : రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా

Rail Accident Wb

Bikaner-Guwahati Express Derails : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బికనీర్‌- గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు చనిపోగా..20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన డొమోహని వద్ద చోటు చేసుకుంది. మృతుల కుటుంబాలకు భారతీయ రైల్వే సంతాపం తెలియచేసింది. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని పేర్కొంది. చాలా దురదృష్టకరమైన ఘటన అని, ప్రస్తుతం రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై దృషి సారించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక బృందం గ్యాస్ కట్టర్ లతో సంఘటనా స్థలానికి చేరుకుందని…సీనియర్ అధికారులు అక్కడనే ఉన్నారన్నారు. 2022, జనవరి 14వ తేదీ శుక్రవారం ఘటనా ప్రదేశానికి వెళుతానన్నారు.

Read More : PM Modi : సీఎంల నుంచి మోదీ అభిప్రాయ సేకరణ

పాట్నా జంక్షన్ నుంచి (గౌహతి – బికనీర్ ఎక్స్ ప్రెస్)లో 98 మంది ప్రయాణీకులు ఎక్కారు. మొకామా నుంచి ముగ్గురు, భక్తియార్ పూర్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఎక్కారని బీహార్ పాట్నా జంక్షన్ చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ తెలిపారు. అయితే..Domohani – New Maynaguri మధ్య గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. దాదాపు పది కోచ్ లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించబడిందని గౌహతి చీఫ్ PRO గునీత్ కౌర్ తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకోవడానికి రైల్వే సేఫ్టీ ఉన్నతస్థాయి కమిషనర్ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర విపత్తు దళం, అగ్నిమాపక దళం ఘటనాప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Read More : Turkmenistan: “నరకానికి ప్రవేశ ద్వారం” మూసివేయండన్న దేశాధ్యక్షుడు

రైలు ప్రమాదం విషయం తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ…పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. రైలు పట్టాలు తప్పిన ఘటనపై సహాయ మంత్రి దర్శన జర్దోష్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తాను నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించడం జరుగుతోందని, ప్రయాణీకులను వారి వారి గమ్యస్థానాలకు తరలిస్తామని ట్వీట్ లో తెలిపారు.