Hyderabad Police
Delhi Blasts: డిల్లీ ఎర్ర కోట మెట్రోస్టేషన్ వద్ద బ్లాస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ సిటీ పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, వస్తువుల గురించి డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ సజ్జనార్ సూచించారు. పాతబస్తీతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
Also Read: మొన్న హ్యాకింగ్.. నిన్న స్లీపర్ సెల్స్ అరెస్ట్.. ఇవాళ ఢిల్లీలో కారు పేలుడు.. ఇదంతా ఉగ్రవాదుల పనేనా?
కాలపత్తర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని టాడ్ బాన్ ఎక్స్ రోడ్డు వద్ద భారీగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్, మెట్రో స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, పార్కులు, జనాలు తిరిగే చోట్ల పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.
డిల్లీ ఎర్ర కోట మెట్రోస్టేషన్ వద్ద బ్లాస్ట్ నేపథ్యంలో ఒక అనుమాతుడిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగిందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
నెమ్మదిగా వచ్చిన వాహనం రెడ్‌లైట్ దగ్గర ఆగిందని, ఆ వాహనంలో పేలుడు జరిగిందని వివరించారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ కారులో హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్ ఉపయోగించినట్లు తెలుస్తోంది.