Registration department
LRS Registration: అనధికార లేఅవుట్లలోని (కటాఫ్ తేదీ నాటికి) ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రిజిస్ట్రేషన్లశాఖ ప్రత్యేక మాడ్యూల్ ను సిద్ధం చేసింది. ఎల్ఆర్ఎస్ కింద ఇప్పటికే దరఖాస్తు చేసినవీ లేదా కొత్తగా చేయనున్న అన్ని ఓపెన్ ప్లాట్లు (లింకు డాక్యుమెంట్లు ఉన్నవీ లేనివీ) కొత్త మాడ్యూల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈమేరకు ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్లు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లకు ఆ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ సర్క్యులర్ పంపారు.
తాజా సర్క్యూలర్ ప్రకారం ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఐదు అంచెల చెక్ లిస్ట్ ను పాటించాల్సి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ లోని అంశాలను లేఅవుట్ లేదా ప్లాట్ యాజమాని ధ్రువీకరించాల్సి ఉంటుంది.
♦ లేఅవుట్ లో 26 ఆగస్టు 2020నాటికి 10శాతం మేర ప్లాట్ల విక్రయాలు జరిగాయని నిర్ధారించుకునేందుకుగాను ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ల (ఈసీ)ను చెక్ చేయాలి.
♦ ప్రత్యేక ఫార్మాట్ లో ఆ 10శాతం ప్లాట్ల వివరాలను ఇవ్వాలి.
♦ 10శాతం ప్లాట్లు అమ్మిన అనంతరం లే-అవుట్ ప్లాన్ చెక్ చేయాలి.
♦ వీటితోపాటు ప్లాట్ లేదా లే-అవుట్ యాజమానికి డిక్లరేషన్ ఇవ్వాలి.
♦ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు నంబర్ తో పాటు ప్లాటు యాజమాని ప్రభుత్వానికి చెల్లించిన మొత్తానికి రసీదును పరిశీలించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అన్నదానిపై సబ్ రిజిస్ట్రార్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: మూడ్రోజులు భగభగలే.. అత్యవసరమైతేనే బయటకు రండి..! ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో..
లేఅవుట్ యాజమానులు ఇవ్వాల్సిన ప్రత్యేక ఫార్మాట్ లో పొందుపర్చాల్సిన వివరాలు..
జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్, లేఅవుట్ విస్తీర్ణం, లేఅవుట్ లోని మొత్తం ప్లాట్లు, క్రయ, విక్రయాలు లావాదేవీలు జరిగిన 10శాతం ప్లాట్లకు సంబంధించి ప్లాట్ల నంబర్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్లు, సంవత్సరం, ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లావాదేవీలు జరిగింది అనే వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.