Remdesivir Black Market
Remdesivir, Oxygen if sold on the black market : తెలంగాణలో బ్లాక్ మార్కెట్ దందాపై పోలీసులు నిఘా పెట్టారు. నిన్న ఉన్నతస్థాయి సమావేశంలో పోలీసులకు హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. బ్లాక్ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. రెమిడిసివర్, ఆక్సిజన్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాలపై దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే మూడు కమిషనరేట్ పరిధిలో పలు ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ సరూర్‌నగర్ లో రెమిడిసివిర్ ఇంజెక్షన్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్‌ను 35 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హెటిరో ఉద్యోగి నాగరాజుతో పాటు ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన రమేష్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
మల్కాజ్‌గిరి పరిధిలో అధిక ధరకు రెమిడిస్‌విర్ విక్రియిస్తున్న వ్యక్తిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లిశెట్టి శేషు బాబు కుశాయిగూడాలో 30 వేల రూపాయలకు ఇంజక్షన్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. అతని నుంచి 6 రెమిడిసివిర్ ఇంజక్షన్స్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.