Srinivas Goud : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనుషులకు గౌరవం పెరిగింది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ లో ఆడపిల్లలకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మోహన్ రెడ్డి అనడం తమందరి అదృష్టం అని అన్నారు.

Mahabubnagar : మహబూబ్ నగర్ లో ఓఐటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్పేస్ కానీ, భూమిని కానీ ఇస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నాడు పాలమూరులో తాగునీరు, కరెంట్ కు నోచుకోకుండా ఉండటమే కాదు.. అంబలి కేంద్రాలు వెలిశాయంటే.. ఇక్కడి దుస్థితి ఏంటో తెలుస్తుందన్నారు. ఇప్పుడిప్పుడే సీఎం కేసీఆర్ నాయకత్వంలో మనుషులకు గౌరవం పెరిగిందని తెలిపారు. కొంత మంది ఇక్కడ పుట్టి.. పెద్ద నాయకులుగా ఎదిగి.. పుట్టిన గడ్డకు చేసింది శూన్యమని విమర్శించారు.

గురువారం మహబూబ్ నగర్ లో పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటిఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్ మరియు శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ మరియు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

KTR : ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే మైగ్రేషన్.. ఇప్పుడు మహబూబ్ నగర్ అంటే ఇరిగేషన్ : మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోహన్ రెడ్డి ఇక్కడ ఇలాంటి సంస్థ పెట్టినందుకు కృతజ్ఞతలు.. ఈ జిల్లాలో పుట్టిన రుణం తీర్చుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. వారికి ఎలాంటి సహకారం అవసరం ఉన్నా తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. మహబూబ్ నగర్ లో ఆడపిల్లలకు స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మోహన్ రెడ్డి అనడం తమందరి అదృష్టం అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు