Yadagirigutta Temple: నీ ఆశీస్సులతో వచ్చిన సంపదను నీకే ఇచ్చేస్తున్నాను స్వామి.. రూ.4 కోట్ల భవనాన్ని విరాళంగా ఇచ్చిన భక్తుడు.. 

వెంకటేశ్వర్లును దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ముఖ్యకార్యదర్శి శైలజా రామాయ్యర్‌ అభినందించారు. (Yadagirigutta Temple)

Yadagirigutta Temple

Yadagirigutta Temple: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రూ.4 కోట్ల విలువచేసే మూడు అంతస్తుల భవనాన్ని విరాళంగా ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి ఎం.వెంకటేశ్వర్లు తిలక్‌ నగర్‌లో ఉంటారు.

ఆయన నిన్న చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి, తన భవనాన్ని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రిజిస్ట్రేషన్ చేసి, ఆ తర్వాత ఆ పత్రాలను ఆలయ ఈవో వెంకటరావు, చైర్మన్ నరసింహమూర్తికి అందజేశారు.

వెంకటేశ్వర్లును వారు సన్మానించారు. స్వామివారి లడ్డూ ప్రసాదంతో పాటు శేషవస్త్రాలు అందించారు. వెంకటేశ్వర్లును దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ముఖ్యకార్యదర్శి శైలజా రామాయ్యర్‌ అభినందించారు. (Yadagirigutta Temple)

Also Read: బతుకమ్మ వేడుకలు.. టార్గెట్ గిన్నిస్‌ బుక్‌.. హైదరాబాద్‌లో ఎన్ని లక్షల మందితో అంటే? ఇక ఓనం రికార్డును..

మరోవైపు, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9.56 గంటల నుంచి సెప్టెంబర్ 8న అర్ధరాత్రి దాటాక 1.26 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు దేవస్థాన అధికారులు ఓ ప్రకటన చేశారు.

రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే నిత్య పూజలు, కైంకర్యాలు, సత్యనారాయణ వ్రతాల నిర్వహణ ఉంటుంది. చంద్రగ్రహణం తర్వాతి రోజున ఉదయం పూట శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తారు.