తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులకు బోనస్.. ఈవీలకు…
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సాగిన తెలంగాణ మంత్రివర్గ (Telangana Cabinet)సమావేశం ముగిసింది.
- V Santhosh Kumar
- Updated on- August 14, 2026 / 06:39 PM IST
Revanth reddy cabinet decisions global summit and smart cards
- తెలంగాణ క్యాబినెట్ భేటీ ముగింపు
- సన్నాలకు రూ.500 బోనస్ ఆమోదం
- ఈవీ ఆటోలకు సబ్సిడీ పథకం
Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సాగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet) ముగిసింది. ఈ భేటీలో సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, విద్య, వ్యవసాయ రంగాంశాలపై క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల సంఖ్య 3.42 కోట్లకు చేరిందని తెలిపారు.
Monsoon Alert: దేశంలో జోరందుకున్న రుతుపవనాలు.. ఎల్‌ని నో ప్రభావానికి చెక్.. 15 రోజులు భారీ వర్షాలు
గ్లోబల్ సమ్మిట్ 2.0, సాగునీటి ప్రాజెక్టులు:
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేదికగా ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ఆవిష్కరించడంతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. సాగునీటి రంగానికి సంబంధించి మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2 పనులకు రూ.2,100 కోట్లు కేటాయించగా, లబ్ధి చేకూరేలా గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.
వ్యవసాయం, విద్య, స్కిల్ యూనివర్సిటీ:
వానాకాలంలో ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహిస్తూ, క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని తీర్మానించారు. విద్యా రంగంలో ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కొత్తగా 7 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఆమోదం తెలుపడంతో, ఇప్పటివరకు అనుమతులు పొందిన మొత్తం స్కూళ్ల సంఖ్య 86కి చేరింది.
పర్యావరణ పరిరక్షణ, ఈవీ ఆటోలు, హిల్ట్ పాలసీ:
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత గ్రీన్ సిటీగా మార్చేందుకు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను విద్యుత్ వాహనాలుగా (ఈవీ) మార్చే పథకానికి రూ.200 కోట్లు మంజూరు చేశారు. దీనికింద ఒక్కో ఆటో డ్రైవర్‌కు గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే కాలుష్య కారక పరిశ్రమలను నగర శివార్లకు తరలించే ‘హిల్ట్’ పాలసీ దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు మరో 3 నెలలు పొడిగించారు.
