Revanth Reddy
KCR – KTR : జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. జోగు రామన్న చెల్లని రూపాయని కేసీఆర్ నిర్ణయించారు అని పేర్కొన్నారు. అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వవలేదన్నారు. ఆదిలాబాద్ కు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎంపీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారందరికీ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందన్నారు.
జిల్లాలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉన్నా… అక్కడి ప్రజలకు ఇళ్లు రాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే కర్ణాటకలో హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. తెలంగాణలో కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
Gujarat Earthquake : గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు
తమ పథకాలను కేసీర్ కాపీ కొట్టాలని చూస్తున్నారని.. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మరని వెల్లడించారు. ‘ఆదిలాబాద్ లో 8 అసెంబ్లీ స్థానాలు మీరు గెలిపించండి.. రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను’ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి సోనియమ్మకు జన్మదిన కానుక ఇద్దామని తెలిపారు.