Gujarat Earthquake : గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు

కచ్ జిల్లాలోని భచౌకకు 5 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు అయింది.

Gujarat Earthquake : గుజరాత్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5గా నమోదు

Earthquake (4)

Updated On : June 15, 2023 / 12:23 PM IST

Gujarat Kutch : గుజరాత్ ను ఇప్పటికే బిపర్ జాయ్ తుఫాను వణికిస్తుండగా తాజాగా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కచ్ జిల్లాలో బుధవారం సాయంత్రం భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. కచ్ జిల్లాలోని భచౌకకు 5 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదు అయింది.

అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని చెప్పారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర జాయ్ తుఫాను తీరం వైపు దూసుకోస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల మధ్య పాకిస్తాన్ తీరం సమీపంలోని కచ్ లోని ఉన్న జఖౌపోర్టు దగ్గర అది కేంద్రీకృతమవుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Tamil Nadu Govt : తమిళనాడులోకి సీబీఐకి నో ఎంట్రీ .. సీఎం స్టాలిన్ ప్రభుత్వం కీలక ప్రకటన

ప్రస్తుతం గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో బిపర్ జాయ్ తుఫాను పయణిస్తోందని పేర్కొంది. దీంతో గుజరాత్ తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. తుఫాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను భారీ విధ్వంసం సృష్టించనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.