CURE-1 In Telangana: ఇక నుంచి అన్ని బిల్లులు ఒకేచోట.. తెలంగాణలో ‘క్యూర్-1’ వ్యవస్థ..

ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు ‘క్యూర్-1 కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్ (CURE-1 In Telangana) అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Revanth Reddy government releases guidelines for Cure-1 services in Telangana.

  • ఇకపై అన్ని బిల్లులు ఒకేచోట.
  • తెలంగాణ ప్రభుత్వం క్యూర్-1 వ్యవస్థను తెచ్చింది.
  • ప్రభుత్వ చెల్లింపులు సులభతరం.

CURE-1 In Telangana: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసేందుకు ‘క్యూర్-1 కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టమ్’ (CURE-1 In Telangana) అమలుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

Telangana Weather: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి

ఈ నూతన విధానం ద్వారా ప్రజలు తమ ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లులు, నీటి చార్జీలు, ట్రాఫిక్ చలాన్లు తదితర అన్ని రకాల ప్రభుత్వ చెల్లింపులను ఒకే చోట సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రాథమికంగా ఈ ‘క్యూర్-1’ వ్యవస్థను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో అమలు చేయనున్నారు.

ఈ సమగ్ర బిల్లింగ్ వ్యవస్థ రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ (CGG) సంస్థకు అప్పగించింది. వెబ్, మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ఏపీఐ ఇంటిగ్రేషన్, డేటా భద్రత, సైబర్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ వంటి కీలక సాంకేతిక అంశాలను సీజీజీ పర్యవేక్షించనుంది.