Telangana Weather: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి
రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా 24 జిల్లాల్లో 40 నుండి 43 డిగ్రీల(Telangana Weather) మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
Telangana weather update severe heatwave continues orange alert issued for eight districts
- తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది.
- ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.
- రెండు రోజులు వడగాల్పులు వీస్తాయి.
Telangana Weather: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా 24 జిల్లాల్లో 40 నుండి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. శనివారం కూడా 8 జిల్లాల్లో తీవ్ర ఎండలు కాసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
PM Kisan Samman Nidhi: ‘పీఎం కిసాన్’ నిధుల విడుదల.. రూ.18,880 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి
ఈ జిల్లాల్లో శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల (Telangana Weather)మధ్య నమోదవుతాయని, అలాగే శని, ఆదివారాల్లో పలు చోట్ల వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లోనూ సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది జూన్ మూడో వారంలో నగరంలో సగటున 35-36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు ఉండగా, ఈ ఏడాది అవి ఏకంగా 40-41 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం నిజాంపేట బాచుపల్లిలో గరిష్టంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు శుక్రవారం నల్గొండ జిల్లా తిరుమలగిరిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్లే ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. రాబోయే మూడు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర తగ్గుతాయని పేర్కొన్నారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆమె వివరించారు.
